Advertisementt

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉందా?

Thu 24th Aug 2023 05:44 PM
kcr  కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉందా?
Is it possible to face KCR? కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉందా?
Advertisement
Ads by CJ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల విషయంలో ఎంత అలెర్ట్‌గా ఉన్నారు? పక్కా ప్రణాళిను సిద్ధం చేసుకున్నారా? అంటే దీనికంతటికీ ఒకే ఒక్క సమాధానం.. అభ్యర్థుల జాబితా. కనీసం ఎన్నికల ప్రకటన కూడా రాలేదు. కేవలం డిసెంబర్‌లో ఉంటాయన్న న్యూస్ మాత్రం తెలుసు. కానీ కేసీఆర్ ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని ఎన్నికలకు సిద్ధం చేసేశారు. జాబితాను ప్రకటించి ఇక చావో రేవో తేల్చుకోమన్నారు. కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. ఇక టికెట్ దక్కిన అభ్యర్థులంతా ప్రచార బరిలోకి సైతం దిగారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇలా ఉంటే.. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.  

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వాలి.. ఆపై అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఆ లిస్ట్‌ను అధిష్టానానికి పంపించాలి. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ ఇక్కడ జాబితా బయటకు రారు. ఇంత సినిమా ఉంది. పలువురు అభ్యర్థులు అధికార పార్టీ నుంచి టికెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇంకా అభ్యర్థుల్ని ఆకర్షించే పనిలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. పైగా అన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులు లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అందుకే బీజేపీ కూడా అభ్యర్థుల జాబితా అంటూ హడావుడి చేస్తున్నది లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా కనిపించడం లేదు.

బీజేపీ తెలంగాణ చీఫ్‌గా కిషన్ రెడ్డి నియమితులయ్యాక ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్న దాఖలాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఓ ప్రెస్ మీట్‌లు లేవు. బీజేపీ కూడా చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ అయితే పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ విలీనం, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కూడా సిద్ధమవుతోందట. అందులో మరిన్ని కొత్త పథకాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే కష్టం. కాబట్టి తాజా పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌ వ్యూహాలకు కాంగ్రెస్, బీజేపీలు ఎలా గండికొడతాయో.. అసలు కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఈ రెండు పార్టీలకు ఉందో లేదో చూడాలి.

Is it possible to face KCR?:

Can Congress and BJP take on KCR?

Tags:   KCR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ