Advertisementt

అందుకే అజిత్ కి కోపమొచ్చేది

Thu 24th Aug 2023 03:39 PM
ajith kumar  అందుకే అజిత్ కి కోపమొచ్చేది
Ajith Kumar returns to Chennai, gets mobbed by fans at the airport అందుకే అజిత్ కి కోపమొచ్చేది
Advertisement
Ads by CJ

హీరో అజిత్ పబ్లిక్ లో సెల్ఫీల విషయంలో కోపం ఎందుకు ప్రదర్శిస్టారా అంటూ చాలామంది విమర్శిస్తూ ఉంటారు. తమినాడులో గత ఎలక్షన్స్ సమయంలో ఓటు వెయ్యదానికి వచ్చిన అజిత్ అండ్ ఆయన భార్యతో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడడమే కాదు.. ఫోన్స్ తో అజిత్ ని చాలా విసిగించారు. అప్పుడు అజిత్ వారి ఫోన్ తీసుకుని ఒక్కనపడేసిన వీడియోస్ చూపిస్తూ యాంటీ ఫాన్స్ అజిత్ కి ఎంత పొగరు ఫాన్స్ ని పట్టించుకోడు అంటూ విమర్శించారు. 

వారు చేసేపని చూడరు. అక్కడ అజిత్ కి వచ్చిన కోపాన్ని మాత్రమే చూస్తారు. తాజాగా అజిత్ చెన్నైలో అడుగుపెట్టారు. అయన ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వస్తుంటే అజిత్ ని నడవనివ్వకుండా సెల్ఫీల కోసం ఫాన్స్ ఎగబడ్డారు. అజిత్ ని తోసేస్తూ ఆయన్ని కారు దగ్గరి వరకు వెంబడించిన వీడియో చూస్తే దీనికి కాదా అజిత్ కి కోపమొచ్చేది అంటారు. అజిత్ చెన్నై కి వస్తున్నాడని తెలిసి ఫాన్స్ పెద్ద ఎత్తున గుమ్మిగూడిన వీడియో వైరల్ గా మారింది. 

తూనీవు తర్వాత అజిత్ కొన్నాళ్లుగా విదేశీ యాత్రల్లో ఉన్నారు. ఆయన తాజాగా చెన్నైకి తిరిగిరావడంతో ఇకపై ఆయన నటించబోయే విదాముయార్చి సెట్స్ పైకి వెళ్తారని తెలుస్తుంది. ఈ చిత్రంలో అజిత్ త్రిష తో రొమాన్స్ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక ఈ చిత్రంపై అధికారిక ప్రకటన ఇచ్చినా మిగతా వివరాలు మాత్రం మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. 

Ajith Kumar returns to Chennai, gets mobbed by fans at the airport:

Fan Frenzy At Chennai Airport As Ajith Kumar Returns Chennai

Tags:   AJITH KUMAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ