మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చెయ్యాలి.. ఎప్పుడు రాజమౌళి SSMB 29 సెట్స్ లోకి అడుగుపెట్టాలి అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం ఇప్పటికల్లా షూటింగ్ పూర్తయితే రాజమౌళి-మహేష్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో మొదలవుతుంది అనుకుంటే.. ఇప్పటికీ గుంటూరు కారం షూటింగ్ ఓ కొలిక్కిరావడం లేదు. ఇక రాజమౌళి-మహేష్ కాంబోపై ఎలాంటి న్యూస్ వినిపించినా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా రాజమౌళి తండ్రిగారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ SSMB 29పై చిన్నపాటి అప్ డేట్ ఇచ్చారు. అందులో పెద్ద విషయం లేకపోయినా.. అది మాత్రం వైరల్ అయ్యింది. SSMB 29ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు. అందుకు తగ్గట్టుగా విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్.. ఈ సినిమాలో హాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు.
మరి ఇది చాలా ఉన్న వార్తే.. అయినా అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి తన భార్య రమతో కలిసి నార్వే లో SSMB29 కోసం లొకేషన్స్ వేటలో ఉన్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పిక్స్ ని బట్టి అర్ధమవుతుంది.