నందమూరి ఫ్యామిలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎలా ట్రీట్ చేస్తుందో పలు సందర్భాల్లో కనిపించింది. కలిసి ఉన్నట్టే కనబడతారు. కానీ వారి మధ్యలో అంతులేని అగాదం. బాలకృష్ణ ఒక్కడు ఎన్టీఆర్ తో చెయ్యి కలిపినా, మాట్లాడినా ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. కానీ బాలయ్య అలా చెయ్యరు. రీసెంట్ గా హరికృష్ణ కుమార్తె సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ బాల బాబాయ్ కి షేక్ హ్యాండ్ ఇస్తేనే సోషల్ మీడియా షేకైపోయింది.
ఆతర్వాత అదే పెళ్ళిలో నందమూరి మూడోతరం వారసులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లు కలిసి ఉన్న పిక్ బయటికి రాగానే నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇదే కదా మాకు కావాల్సింది అంటూ ముచ్చటపడ్డారు. ఇప్పటివరకు మోక్షజ్ఞని ఎన్టీఆర్ ని కలిసి చూసింది లేదు. మోక్షజ్ఞ-ఎన్టీఆర్ కలిసి ఒకే ఫ్రెమ్ లో కనబడితే ఫాన్స్ ఆగుతారా.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-మోక్షజ్ఞ హగ్ చేసుకున్న పిక్ సోషల్ మీడియాలో కనిపించగానే ఎన్టీఆర్ ఫాన్స్-నందమూరి ఫాన్స్ దానిని వైరల్ చేసి పడేస్తున్నారు.
అన్నా తమ్ముడు #NTR #Mokshagnya 😍 అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్-మోక్షజ్ఞ పిక్ ని ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి అరుదయిన పిక్స్ కేవలం అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకి కన్నుల పండుగే.