Advertisementt

మీడియా ముందుకు రాదా?

Thu 24th Aug 2023 10:52 AM
anushka shetty  మీడియా ముందుకు రాదా?
Anushka avoids media? మీడియా ముందుకు రాదా?
Advertisement
Ads by CJ

అనుష్క నిశ్శబ్దం సినిమా విడుదల అప్పుడు కోవిడ్ కారణంగా పెద్దగా ప్రమోషన్స్ లేయాల్సిన అవసరం రాలేదు. గత కొన్నేళ్లుగా అనుష్క మీడియా ముందుకు రావడం లేదు. ఆమె బరువు ఆమెని బాగా ఇబ్బంది పెడుతోంది. నిశ్శబ్దం అప్పుడు కూడా అనుష్క బరువుపై చాలా విమర్శలొచ్చాయి. తాజాగా ఆమె నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పొలిటిశెట్టి  విడుదలకు రెడీ అయ్యింది. అసలే పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ సెప్టెంబర్ 7 న విడుదలైయ్యేందుకు రెడీ అయ్యింది. 

రీసెంట్ గా మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో అనుష్క కనిపించలేదు. మరి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆసక్తి పెంచాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే నవీన్ పోలిశెట్టి తన వంతుగా శ్రమిస్తున్నాడు. కానీ అనుష్క సహకరించడం లేదు. ఆమె మీడియా ముందుకు వచ్చెందుకు భయపడుతుంది. ఆమె బరువు ఆమెకి ఓ సమస్యగా మారింది. అసలు అనుష్క మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో కనబడుతుందా.. లేదంటే ఓ ఇంటర్వ్యూతోనే ఎమన్నా సరిపెడుతుందా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అతి పెద్ద అనుమానం. 

అటు అనుష్క పబ్లిక్ ఎంట్రీ కోసం మీడియా తెగ వెయిట్ చేస్తుంది. ఈ చిత్రంతో అయినా అనుష్క బయటికొస్తుంది అనుకుంటే.. ఇప్పటివరకు అలా జరిగే ఆస్కారం కనబడలేదు. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం నవీన్ పోలిశెట్టి ఒక్కడే తెగ కష్టపడిపోతున్నాడు. 

Anushka avoids media?:

Why is Anushka Shetty avoiding media?

Tags:   ANUSHKA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ