విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలప్పుడు అనన్య పాండే తో కలిసి ఎంతగా ప్రమోట్ చేసాడో.. ప్యాన్ ఇండియా మార్కెట్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు ఓ నెల పాటు విజయ్ ఎలా బయట తిరిగాడో అందరూ చూసారు. ఇప్పుడు ఖుషి సినిమా విషయంలో విజయ్ ఇదే ఫాలో అవుతున్నాడు. కానీ లైగర్ అంత కాదు అనే విమర్శలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఖుషి ట్రైలర్ లాంచ్ చేసాక.. మ్యూజికల్ నైట్ తో హడావిడి చేసారు. విజయ్-సమంత కలిసి రొమాంటిక్ గా సినిమా ఉంటుంది అనే సంకేతాలు ఈ మ్యూజికల్ నైట్ లోనే చూపించారు. ఈ రెండు ఈవెంట్స్ తర్వాత విజయ్ మళ్ళీ హైదరాబాద్ లో కనిపించలేదు.
చెన్నై, బెంగుళూర్ అంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఖుషి ని సింగిల్ హ్యాండ్ ప్రమోషన్స్ తో విజయ్ పలు నగరాల్లో ప్రమోట్ చేస్తూ కష్టపడుతున్నాడు. అయితే అసలు తెలుగు రాష్ట్రాలని వదిలేసి.. ఇతర భాషల్లో ఖుషి ని ప్రమోట్ చెయ్యడం ఎంతవరకు సమంజసమనే మాట వినబడుతుంది. సరైన పబ్లిసిటీ ప్లానింగ్ లేదు అంటూ నెగిటివిటి స్టార్ట్ చేసారు. మంచి అంచనాలున్న సినిమాకి ఇలా పబ్లిసిటీని తగ్గించుకుంటే ఎలా అంటున్నారు. మరి ఇతర భాషల్లోనూ ఖుషి ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అవసరమే. అలా అని హైదరాబాద్ ని, తెలుగు రాష్ట్రాలని తక్కువ చెయ్యకూడదు.
అసలే సమంత కూడా అందుబాటులో లేదు. విజయ్-శివ నిర్వాణ ఇద్దరూ కలిసి సినిమాని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అంతగా చేస్తున్నారా.. తెలుగు విషయంలో ఇంత లైట్ గా ఉండడం కొంతమందికి నచ్చడం లేదు. సినిమాపై ఎక్కడ బజ్ తగ్గుతుందో అని వారి అభిప్రాయం. మరి సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఖుషి ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త బెటర్ గా కనిపిస్తే బావుండు.. చూద్దాం ఈ వారంలో ఏం చేయబోతున్నారో అనేది!