సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఆగష్టు 10 న థియేటర్స్ లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన జైలర్.. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు.. 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి రికార్డులు సృష్టించింది. పదేళ్లకు పైగా సూపర్ స్టార్ రజినీకాంత్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకి జైలర్ సక్సెస్ ఎంతో ఊరటనిచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న జైలర్ మూవీని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకి డిజిటల్ రైట్స్ చేజిక్కించుకుంది.
ఇంకా ఇంకా థియేటర్స్ లో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్న జైలర్ నెల తిరక్కుండానే ఓటిటీ లోకి రాబోతుంది అని తెలుస్తోంది. అది సెప్టెంబర్ 7న నెట్ ఫ్లిక్స్ నుండి జైలర్ ఓటిటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైనట్టుగా సమాచారం. ఈ విషయమై అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ప్రకటన విడుదల చెయ్యాల్సి ఉంది.
అయితే అదే సెప్టెంబర్ 7 న హిందీ డబ్బింగ్ జైలర్ నార్త్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఎలాంటి అంచనాలు లేకుండానే నెల్సన్ సూపర్ స్టార్ కి ఇంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.