సుడిగాలి సుధీర్ గా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లో కమెడియన్ గా ఫేమస్ అయిన సుధీర్ ఆ తర్వాత ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ తో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. కమెడియన్ గా బుల్లితెర మీద పాపులర్ అయిన సుధీర్ తర్వాత వెండితెరపై కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. ఇప్పటికే సుధీర్ హీరోగా రెండుమూడు చిత్రాలు ఆడియన్స్ ముందుకు రాగా.. మరో రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి.
ప్రస్తుతం G.O.A.T అనే ప్యాన్ ఇండియా మూవీ తో హడావిడి చేస్తున్న సుధీర్ పూర్తిగా ఈ టీవీని పక్కనపెట్టేశాడు. రష్మీ గౌతమ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్రి అంటూ లవర్స్ గా అందరి మనసులో ముద్ర వేసిన సుధీర్ చాన్నాళ్లుగా ఈటీవికి దూరంగా ఉంటున్నాడు. హీరో అయ్యాడు ఇకపై ఈటీవీలో కనిపించడని ఆయన అభిమాములే ఫిక్స్ అయ్యారు. మధ్య మధ్యలో ఈటీవికి వచ్చి వెళుతున్నా ప్రోపర్ గా అయితే సుధీర్ షో ఈటీవీలో కనిపించలేదు. ఈటివి నుండి బయటికొచ్చాక స్టార్ మా లో యాంకర్ గా మెరిశాడు. తర్వాత బుల్లితెర మీద అరుదుగానే కనబడుతున్నాడు.
ఇప్పుడు ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చాడా అనేలా సుడిగాలి సుధీర్ ఈటివి 28th యానివర్సరీ సెలెబ్రేషన్స్ లో రష్మీ గౌతమ్ తో కలిసి సందడి చేసాడు. మళ్ళీ రష్మీ తో కలిసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రి మొదలెట్టేసాడు. సుధీర్ ఇలా ఈటీవీలో ఓ షోతో కనిపించగానే ఆయన అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.