చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు తమ వారసులని హీరోలుగా పరిచయం చేస్తూనే ఉంటారు. అందులో కొంతమంది హీరోలుగా నిలదొక్కుకుంటే.. కొంతమంది చాలా త్వరగా కనుమరుగైపోతూ ఉంటారు. వారసులుగా ఎంత ఈజీగా హీరోలుగా పరిచయమైనా.. తర్వాత వాళ్ళ టాలెంట్ ని బట్టే హీరోలుగా స్ట్రాంగ్ అవుతారు. లేదంటే వారసుల్లానే అనామకులుగా మిగిలిపోతారు. కానీ సినిమా ఇండస్ట్రీలో నేపోటిజంపై ఎంతోమంది ఎన్నోరకాలుగా విమర్శిస్తూ ఉంటారు.
అసలు సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాపై వస్తున్న ట్రోల్స్ పై రేణు దేశాయ్ స్ట్రాంగ్ గా స్పందించింది. వారసులకు సినిమాల్లోకి ఈజీగా అవకాశాలొస్తాయి.. అది ఎంతవరకు సమంజసం అంటూ ఓ నెటిజెన్ ప్రశ్నకి రేణు దేశాయ్ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. మీ ప్రశ్న నచ్చింది. అంబానీ తన ఆస్తిని తన వారసులకు ఇవ్వకుండా పక్కన వారికి ఇస్తే అది సమంజసమేనా? సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది వారసులుగా హీరోలుగా పరిచయమవడం సులువుగానే జరుగుతుంది.
హీరోలుగా ఎంట్రీ ఇచ్చాక వారు పేరెంట్స్ వారసత్వాన్ని నిలబెట్టలేకపోయినా.. హీరోలుగా నిలదొక్కుకోలేకపోయినా.. వారిని ఎంతోమంది పనిగట్టుకుని తెగ విమర్శిస్తారు. ఎలాంటి జాలి లేకుండా దారుణంగా ట్రోల్ చేస్తారు. సినీ వారసులు కాకుండా కొత్త వారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోలేకపోతే మాత్రం వాళ్ళని అసలు పట్టించుకోరు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు స్టార్స్ అవుతారు.
ఇక్కడ విషయం ఏమిటంటే.. వారసులు రావడం ముఖ్యం కాదు, వాళ్ళలోని టాలెంట్ ముఖ్యం. ప్రతిభ ఉంటేనే స్టార్స్ అవుతారు. కానీ వారసులు కావడం వల్ల స్టార్స్ కారు అంటూ రేణు దేశాయ్ అకీరాపై వస్తున్న ట్రోల్స్ పై, నెపోటిజంపై కీలక కామెంట్స్ చేసింది.