రేపు శుక్రవారం ఆగస్టు 25 న టాలీవుడ్ లో ముక్కోణపు పోటీ జరగబోతుంది. ఒక్కరోజే ముగ్గురు కుర్ర హీరోలు పోటీ పడబోతున్నారు. అందులో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ తేజ్ - సాక్షి వైదే జంటగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గాండీవధార అర్జున ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగున్నాయి. అందులోను పెళ్లికొడుకుగా మారబోతున్న వరుణ్ చిత్రంపై మెగా అభిమానుల్లో ఓ రకమైన ఆసక్తి కనిపిస్తుంది.
ఇక కార్తికేయ RX 100 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వాలిమైతో విలన్ గా మారిన కార్తికేయ నుండి వస్తున్నచిత్రం బెదురులంక 2012. ఈ చిత్రంలో కార్తికేయ-నేహా శెట్టి జోడి కట్టారు. కార్తికేయ ఈ చిత్రం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
ఇక ముచ్చటగా మూడో సినిమా కింగ్ ఆఫ్ కోత. మహానటి, కనులకనులను దోచాయంటే, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత అనే మలయాళ చిత్రంతో ఒక్కరోజు ముందే అంటే ఆగస్ట్ 24 నే రాబోతున్నాడు. డబ్బింగ్ సినిమానే అయినా.. దుల్కర్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మర్కెట్ లో రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రంతో దుల్కర్ సీతారామం సక్సెస్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు.
మరి ఈ కుర్ర హీరోల బాక్సాఫీసు ముక్కోణపు పోటీలో గెలుపెవరిదో అంటూ తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఈ శుక్రవారం ఏ హీరో బాక్సాఫీసు దగ్గర నిలబడతాడో అనేది.