Advertisementt

సమంతపై మళ్ళీ మొదలైన ట్రోలింగ్

Wed 23rd Aug 2023 10:41 AM
samantha  సమంతపై మళ్ళీ మొదలైన ట్రోలింగ్
Trolling again on Samantha సమంతపై మళ్ళీ మొదలైన ట్రోలింగ్
Advertisement
Ads by CJ

సమంతపై కొద్దిరోజులుగా భారీ ట్రోలింగ్ అనేది రోటీనైపోయింది. ఆమె ఏం చేసినా కూడా నెటిజెన్స్ మాత్రం ఆమెని ట్రోల్ చేసేస్తున్నారు. ట్రోలర్స్ కి సమంత గట్టిగా కౌంటర్లు వేసినా ఆ ట్రోలింగ్ మాత్రం ఆగదు. మొన్నామధ్యన హెల్త్ ప్రోబ్లెంస్ అని చెప్పిన సమంత హైదరాబాద్ శాకుంతలం ప్రమోషన్స్ లో డల్ గా కనబడి.. సిటాడెల్ ప్రమోషన్స్ కోసం లండన్ లో ఫ్రెష్ గా ఎంజాయ్ చెయ్యడంపై కూడా నెటిజెన్స్ తీవ్రంగా విమర్శించారు. 

ఇప్పుడు కూడా సమంత ఖుషి ప్రమోషన్స్ అలా అలా చక్కబెట్టేసి అమెరికా వెళ్ళిపోయింది. ఖుషి మూవీ షూటింగ్ సమాయంలో ఆమె హెల్త్ తో ఎంతగా సఫర్ అయ్యిందో ఆమె కో స్టార్ విజయ్ దేవరకొండ చెప్పాడు. ఆమె కూడా ఖుషి ప్రమోషన్స్ లో అలానే డల్ గా కనబడింది. ఇక రీసెంట్ గానే అమెరికా వెళ్లిన సమంత అక్కడ హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు. ఆమె హెల్త్ ట్రీట్మెంట్ ఏమో కానీ.. అక్కడ సమంత హుషారుగా న్యూయార్క్ నగర వీధుల్లో చక్కర్లు కొడుతోంది. 

వాకింగ్, జిమ్, మధ్యలో పబ్లిక్ ఈవెంట్స్ అంటూ సమంత ఒకటే హడావిడి చేస్తుంది. దానితో హెల్త్ రీజన్స్ అని చెప్పి ఖుషి ప్రమోషన్స్ చెయ్యకుండానే అమెరికా వెళ్లిపోయావ్.. కానీ అక్కడ ఇంత యాక్టీవ్ గా కనబడుతున్నావే అంటూ మరోసారి ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. మరి ఈ ట్రోల్స్ పై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Trolling again on Samantha:

Samantha Ruth Prabhu is enjoying the New York

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ