బాలీవుడ్ క్వీన్ కంగనాకు బాలీవుడ్ ప్రముఖులంటే చాలా మంట. ఎందుకంటే తనకి అవకాశాలు ఇవ్వరు, తనని ఎదగనివ్వరు ఇలా కంగనా ప్రముఖులపై ఆమీర్, కరణ్ జోహార్, హ్రితిక్, ముఖ్యంగా స్టార్ కిడ్స్ అలియా భట్, అనన్య పాండే ఇలా చాలామందిపై కంగనా తరచూ విరుచుకుపడుతుంది. అయితే కంగనా రనౌత్ నటించిన ఎమెర్జెన్సీ మూవీపై బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ కామెంట్ చేసారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్న ఎమెర్జెన్సీ చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ కరణ్ ట్వీట్ చేసాడు.
దానితో కంగనా తనని అప్రిషేట్ చేస్తూ తన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అన్న కరణ్ కి థాంక్స్ చెప్పాల్సింది పోయి.. అతనిపై రివర్స్ ఎటాక్ చేస్తుంది. హహ.. గతంలో మణికర్ణిక రిలీజ్ అయినప్పుడు కూడా మణికర్ణిక చూసేందుకు ఆతృతగా ఉన్నాను అంటూనే.. సినిమా రిలీజ్ అయ్యాక వారాంతంలో నాపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేసారు. నాపై నా సినిమాపై నెగిటివిటి కోసం డబ్బులు కూడా ఖర్చు చేసారు.
ఇప్పుడు మళ్ళీ నా సినిమా చూడాలని ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ చెప్పడం విడ్డురంగా ఉంది, నిజంగా మీరు ఇలా మాట్లాడుతుంటే భయమేస్తుంది. ఎందుకంటే గతంలోలా మీరు నా సినిమాపై చూపిస్తున్న ఆత్రుత వెనక ఉన్న కారణం ఏమిటో.. దాని వెనుక ఎలాంటి ఉద్దేశ్యం ఉందొ అంటూ ట్వీటేసింది.
ఆమెని అభినదించినా కంగానాకి నచ్చదేమో అందుకే ఇలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.