Advertisementt

మనవరాలు క్లీంకార తో మెగాస్టార్

Tue 22nd Aug 2023 12:55 PM
chiranjeevi  మనవరాలు క్లీంకార తో మెగాస్టార్
Megastar with granddaughter Klin Kaara మనవరాలు క్లీంకార తో మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వారసురాలిగా మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టింది రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లీంకార. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో జన్మించిన మెగా వారసురాలిని చూసి మెగాస్టార్ మురిసిపోయారు. తన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటూ మీడియా ముందు తన సంతోషాన్ని ఎక్ష్ప్రెస్స్ చేసారు. మనవరాలికి పేరు పెట్టేందుకు బారసాలతో హడావిడి చేసారు. 

తాజాగా మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా మనవరాలిని ఎత్తుకుని ముచ్చటపడుతున్న పిక్ ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Happiest Birthday to our dearest CHIRUTHA - (Chiranjeevi Thatha) Loads of love from us & the Littlest member of the KONIDELA family. 😍 తన తాతకి క్లీంకార బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈపిక్ లో క్లీంకార ఫేస్ కనిపించకుండా కవర్ చేసారు. 

మెగాస్టార్ చిరుకి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా చిన్నా, పెద్ద హీరోలు, హీరోయిన్స్, చిరు తో పని చేసిన సీనియర్స్ అంతా ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ పెడుతున్న పోస్ట్ లతో సోషల్ మీడియా తడిచిముద్దవుతుంది. అందులో తన మనవరాలు క్లీంకార ని ఎత్తుకుని ఉన్న పిక్ మాత్రం స్పెషల్ గా హైలెట్ అయ్యింది. 

Megastar with granddaughter Klin Kaara:

Chiranjeevi And Granddaughter Klin Kaara In His Birthday Special

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ