ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాలతో బాక్సాఫీసు వెలిగిపోతుంటే.. ప్రేక్షకులు సరదాగా వీకెండ్ ఎంజాయ్ చెయ్యడానికి థియేటర్స్ బాట పడుతూ ఉంటారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఓటిటిలోకి ఏ చిత్రం వస్తుందా.. శని,ఆదివారాలు ఏ ఓటిటీ చిత్రాలని వీక్షిద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాల ప్రమోషన్స్ తో ఏయే చిత్రాలు రిలీజ్ అవుతున్నాయో ప్రేక్షకులకి తెలిసిపోతుంది, ఇక ఓటిటీ చిత్రాలు, సీరీస్ ల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ గూగుల్ లో వెతికేస్తూ ఉంటారు.. అందుకే వారం వారం విడుదల కాబోతున్న చిత్రాల లిస్ట్ ని అందిస్తున్నామ్.. ఈ వారం విడుదలయ్యే థియేటర్స్ చిత్రాల లిస్ట్ మీ కోసం..
వరుణ్ తేజ్-సాక్షి వైదే జంటగా గాండీవధార అర్జున్ ఆగష్టు 25 న విడుదలకి రెడీ అయ్యింది. కార్తికేయ-నేహా శెట్టిల బెదురులంక 2012 కూడా అదే రోజు పోటీ పడుతుంది. ఇక డబ్బింగ్ మూవీగా దుల్కర్ కింగ్ ఆఫ్ కోత అదే రోజు ఈ యంగ్ హీరోలతో పోటీకి సై అన్నాడు.
ఈ వారం ఓటిటీలో విడుదలయ్యే చిత్రాల లిస్ట్..
ఆహా ఓటీటీ 1. బేబీ-ఆగస్టు 25న విడుదల
నెట్‌ఫ్లిక్స్: బ్రో-ఆగస్టు 25న విడుదల
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: అశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల
ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
బుక్ మై షో 1. సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇంగ్లీష్ సినిమా - ఆగస్టు 21న విడుదల