Advertisementt

మెగా ఫాన్స్ వెయిటింగ్

Mon 21st Aug 2023 07:47 PM
mega fans  మెగా ఫాన్స్ వెయిటింగ్
Mega fans are waiting మెగా ఫాన్స్ వెయిటింగ్
Advertisement
Ads by CJ

రేపు అంటే ఆగష్టు 22 కోసం మెగా అభిమానులు ఏడాది మొత్తం వెయిట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి నుండి కొత్త సినిమాల కబుర్లు, షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సినిమాల లుక్స్, ఆయన కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు, మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అబ్బో హంగామా మాములుగా ఉండదు. అందుకే రేపు ఆగష్టు 22 న మెగాస్టార్ నుండి ఏ కొత్త సినిమా కబురు అందుతుందో.. ఏ కొత్త సినిమా పోస్టర్ వస్తుందో అని తెగ ఆత్రుత చూపిస్తున్నారు. 

మరి మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా 157 కి శ్రీకారం చుట్టబోతున్నారనే న్యూస్ వుంది. కానీ భోళా శంకర్ రిజల్ట్ తర్వాత మెగాస్టార్ మనసు మారింది అంటున్నారు. మరోపక్క మెగా 57 నుండి మెగా పోస్టర్ రాబోతుంది అంటున్నారు. అంతేకాకుండా ఆ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా రేపే జరిగే అవకాశం ఉందట. అయితే చిరు ఈపూజ కార్యక్రమాలో పాల్గొనరు. 

ఎందుకంటే చిరు మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. రీసెంట్ గా తనకెంతో ఇష్టమైన బ్రహ్మానందం కొడుకు సిద్దార్థ్ పెళ్ళికి రాలేకపోయారు. ఆయన సతీమణి సురేఖ, కొడుకు-కోడలు హాజరయ్యారు. అయితే మెగా 157 నుండి రాబోయే అప్ డేట్ గురించి మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ ఊసేది సోషల్ మీడియాకి చేరలేదు. మరికొద్ది గంటల్లో మెగా ఫాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో మెగాస్టార్.. జస్ట్ వెయిట్ అండ్ సి. 

Mega fans are waiting:

Mega fans waiting for a mega treat

Tags:   MEGA FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ