నందమూరి వారింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అక్కడ ఎవరెవరున్నారు, ఎవరెవరు కలుసుకున్నారు. ఎన్టీఆర్-బాలకృష్ణ కలిసారా, బాల బాబాయ్ తో ఎన్టీఆర్ మాట్లాడాడా.. ఇలా నందమామూరి వారి అభిమానుల దగ్గర నుండి సాధారణ ప్రజల వరకు తెగ ఆలోచించేస్తారు. సోషల్ మీడియాలో ఒకవేళ వారు కలిసి కనబడిన వీడియో కానీ, పిక్ కానీ కనిపిస్తే దానిని అలా చూస్తుండిపోతారు. అంత అబ్బురంగా ఫీలైపోతారు. తాజాగా నందమామూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కొడుకు పెళ్లి హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ తన సిస్టర్ సుహాసినితో కలిసి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్న వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణకి, రామకృష్ణకి ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో అయితే ట్రెండ్ అవుతుంది. ఇక బాలయ్య ఆయన భార్య వసుంధరతో కలిసి కొడుకు మోక్షజ్ఞ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ పెళ్ళిలో సందడి చేసిన మోక్షజ్ఞ మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి ఫొటో దిగాడా అనిపించేలా ఓ పిక్ బయటికొచ్చింది.
తారక్-కళ్యాణ్ రామ్-మోక్షజ్ఞలు కలిసి సింగిల్ ఫ్రెమ్ లో కనిపించేసరికి నందమూరి అభిమానులు ముక్త ఖంఠంతో మూడోతరం నందమూరివారి ముగ్గురు మొనగాళ్లు అంటూ హ్యాపీగా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, కళ్యాణ్ రామ్ వెడ్డింగ్ వేర్ లో మోక్షజ్ఞ అయితే చిన్న పిల్లాడిలా కనిపించాడు. ఈమధ్యన బొద్దుగా ముద్దుగా కనబడిన మోక్షుజ్ఞ ఇప్పుడు స్లిమ్ గా హీరోలా కనిపించడం అందులోను ఎన్టీఆర్ తో పిక్ షేర్ చేసుకోవడం అభిమానులని ఆనందపడేలా చేసింది.