పవన్ కళ్యాణ్ బ్రో సినిమా షూటింగ్ మొదలైన ఆరు నెలలోపే షూటింగ్ ఫినిష్ చేసి ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లేదంటే OG చిత్రానికి డేట్స్ కేటాయిస్తారని అనుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వగా హరీష్ శంకర్ ఆ పనిలో ఉన్నారని అన్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ OG కోసం డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది.
అక్టోబర్ లో OG కోసం ఇరవై రోజులు, నవంబర్ లో ఎనిమిది రోజులు డేట్ కేటాయించారట పవన్ కళ్యాణ్. అక్టోబర్ లో మొదలు కాబోయే షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ బ్యాంకాక్ వెళతారని సమాచారం. ఇరవై రోజుల షెడ్యూలు బ్యాంకాక్ లో వుంటుంది. అక్కడ బ్యాంకాక్ లో షూటింగ్ చిత్రకరణ కోసం లోకేషన్స్ వేటలో సుజిత్ ఉన్నాడట. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్న ఈ చిత్రానికి ద కాల్ హిమ్ OG టైటిల్ నే పెట్టబోతున్నట్టుగా నిర్మాత దానయ్య ఈమధ్యన ఇండైరెక్ట్ గా చెప్పారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎన్నికల లోపు అంటే ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేకర్స్. అసలైతే డిసెంబర్ లోనే OG ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి అది జరిగేలా కనిపించడం లేదు.