Advertisementt

బాలా బాబాయ్ తో చెయ్యి కలిపిన Jr ఎన్టీఆర్

Mon 21st Aug 2023 08:13 AM
jr ntr  బాలా బాబాయ్  తో చెయ్యి కలిపిన Jr ఎన్టీఆర్
Jr NTR joined hands with Bala Babai బాలా బాబాయ్ తో చెయ్యి కలిపిన Jr ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.. ఎందుకో తెలుసా బాల బాబాయ్ కి ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. నిన్నమొన్నటివరకు బాలకృష్ణతో ఎన్టీఆర్ సఖ్యతగా లేదు అంటూ మాట్లాడిన అదే సోషల్ మీడియా ఈరోజు ఎన్టీఆర్ బాలయ్యకి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని వైరల్ చేస్తుంది. తారకరత్న మరణం విషయంలో బాలయ్య ఎన్టీఆర్ తో ఎంత దూరంగా కనిపించారో.. సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ అందరిని పలకరించుకుంటూ వెళుతూ బాబాయ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరిని ఆకర్షించింది. 

మరి బాలకృష్ణ ఎన్టీఆర్ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అంటూ తారకరత్న పెద్ద కర్మ అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు చూసిన నందమూరి అభినులు చాలా బాధపడ్డారు. కానీ హరికృష్ణ కూతురు సుహాని కొడుకు పెళ్ళిలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆ క్రమంలోనే బాలకృష్ణని, రామకృష్ణని అందరిని ఎన్టీఆర్ పలకరించిన తీరుకి నందమూరి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఆ వీడియో ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

ఆ వీడియో పెట్టి బాబాయ్ తో చెయ్యి కలిపిన జూనియర్ ఎన్టీఆర్.. ఇది చాలా మీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Jr NTR joined hands with Bala Babai:

Jr NTR at Suhasini son wedding

Tags:   JR NTR