సీనియర్ లిస్ట్ లోకి వెళ్లినా ఇప్పటికీ భారీ బడ్జెట్ చిత్రాలతో, స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తుంది త్రిష. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలలో త్రిష కుందవై పాత్రతో ఆకట్టుకోగా.. ఆ సినిమా ప్రమోషన్స్ తో త్రిష ఒక్కసారిగా లైమ్ టైం లోకి వచ్చేసింది. సారీస్ మాత్రమే కాదు ప్రతి కాస్ట్యూమ్ లో త్రిష అందం మరింతగా పెరిగిందా అనేలా ఆమె ఆ సినిమా ప్రమోషన్స్ లో కనిపించింది.
అయితే కొన్నేళ్ల క్రితం త్రిష చెన్నై కి చెందిన వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత ఆ నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి ఊసు ఎత్తకుండానే సినిమాలు చేసుకుంటుంది. ఇప్పుడు త్రిష.. విజయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న LEO దసరాకి రిలీజ్ కాబోతుంది అజిత్ తో కలిసి నటించబోయే AK 62 అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే తాజాగా త్రిషకి పెళ్లిపై గాలి మల్లిందా అనేలా బిహేవ్ చేస్తుంది.
ఎందుకంటే.. ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ తన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు.. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే విడాకులు తీసుకోవాలని మాట్లాడుకోవడం నా చేవిన పడ్డాయి. అందుకే నాతొ లైఫ్ లాంగ్ కలిసి ఉండే వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
త్రిష ఇలా పెళ్లి మాటలు మాట్లాడిన తర్వాత తన ఇన్స్టా పేజీలో మంచి మంచి బ్రైడల్ సారీ లుక్స్ ని షేర్ చేస్తూ రావడంతో.. ఆమె అభిమానులు, మిగతా నెటిజెన్స్ అందరూ త్రిషకి పెళ్లిపై గాలి మళ్ళిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.