ఏపీలో సైకిల్ వచ్చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఏమో.. సంక్షేమ పథకాలు కాపాడవచ్చేమో వైసీపీని అన్న డౌటానుమానం ఏదో ఒక మూలన ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీస్‌లా భావించిన పంచాయతీ ఉపఎన్నికల్లో టీడీపీ చెలరేగిపోయింది. ఎటూ చూసినా పసుపుమయం!
మొత్తానికి ఏపీలో జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగుర వేసింది. వైసీపీ కచ్చితంగా గెలుస్తుందన్న నియోజకవర్గాల్లో సైకిల్ సవారీ చేసింది. ముఖ్యంగా.. వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీని అల్లాడించింది.
సైకో పోతున్నాడు.. సైకిల్ వచ్చేస్తోందన్న భావనను అయితే జనంలో తీసుకురాగలిగింది. పసుపు ప్రభంజనంతో గ్రామాలు ఊగిపోతున్నాయని టీడీపీ చెప్పుకుంటోంది. ఇది ఊపు మీద ఉంటే మాత్రం ఎన్ని ఐ ప్యాక్‌లు వికెట్ కీపర్ అవతారమెత్తినా వైసీపీ క్లీన్ బౌల్డ్ కావడం ఖాయం.అసలు సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీకి ఎదురు గాలి వీస్తుందని ఎవరైనా అనుకుంటామా? కానీ అదీ జరిగిపోయింది.కడప జిల్లాలో ఐదు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఒక వార్డులకు గానూ.. మూడు టీడీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం ఆసక్తిని రేకెత్తించింది.
ఇక గుంటూరు జిల్లాలో అయితే వైసీపీకి మైండ్ బ్లాక్ అయిపోయిందంతే. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ గ్రామంలో మొత్తం 2,738 ఓట్లు ఉన్నాయి. నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికలో 2,145 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి పరుచూరి విజయలక్ష్మికి అత్యధికంగా 1,787 ఓట్లు పోలవడం గమనార్హం. ఇక తెనాలి మండలం హాఫ్‌పేటలో 7వ వార్డుకు ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ గతంలో వైసీపీ గెలుపొందగా.. ఈసారి టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు.
పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం..
మొత్తం 485 వార్డ్స్ కి పోలింగ్ జరిగింది..
టీడీపీ - 189 గెలిచింది
వైసీపీ - 177
ఇండిపెండెంట్ - 100
జనసేన + బీజేపీ - 19
ప్రెసిడెంట్ పోలింగ్ 59 పంచాయితీలు..
టీడీపీ - 28
వైసీపీ - 17
ఇతరులు - 12
జనసేన+ బీజేపీ - 02