సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఈనెల 10న ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైంది. జైలర్ విడుదలైన ప్రతి భాషలోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలో అయినా జైలర్ అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం అంత బ్లాక్ బస్టర్ అవడానికి కారణం సినిమా కంటెంట్ తో పాటుగా ప్రమోషన్స్ అనుకునేరు.
ప్రమోషన్స్ లో భాగంగా మాతృ భాష అయిన చెన్నై లో కేవలం ఓ ఆడియో లాంచ్ మాత్రమే నిర్వహించారు. ఇటు తెలుగులో ఎప్పుడూ రజినీ తన సినిమాలని ప్రమోట్ చేసేవారు. కానీ జైలర్ విషయానికొచ్చేసరికి ఎందుకో లైట్ తీసుకున్నారు. నెల్సన్ కూడా హైదరాబాద్ వచ్చి జైలర్ ని ప్రమోట్ చెయ్యలేదు. హైదరాబాద్ అనే కాదు బెంగుళూరు, కొచ్చి, ముంబై ఇలా ఎక్కడా సినిమాని ప్రమోట్ చేయలేదు.
కానీ ప్రేక్షకులకి సినిమా నచ్చేసింది. అందుకే ప్రమోషన్స్ లేకపోయినా పట్టించుకోలేదు. రజినీకాంత్ తో పాటుగా జైలర్ టీం కూడా ఇతర భాషల్లో జైలర్ ని ప్రమోట్ చేసి ఉంటే.. ఈ చిత్రం కొత్త రికార్డులని సృష్టించేది అంటున్నారు. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే జైలర్ ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతూ రెండు వారాలు పూర్తి కాకుండానే 500 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతుంది.