పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో జులై 28 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. బ్రో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దానిపై వైసీపీ నేతలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.. బ్రో సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా వైసీపీ పార్టీ చేసిన జాతర, రచ్చ ఆ సినిమా నిర్మాతలని కొంతమేర గట్టెక్కించింది. పవన్ కళ్యాణ్ గాడ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించాడు. థియేటర్స్ లో సో సో గా ఆడిన ఈ చిత్రం ఓటిటీ రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్.
పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి బ్రో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు భారీ డీల్ తో డీజీల్ స్ట్రీమింగ్ రైట్స్ ని చేజిక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు బ్రో రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపించినా ఇప్పుడు మాత్రం బ్రో సినిమాని వచ్చే శుక్రవారం అంటే ఆగష్టు 25 న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
మరి పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్స్ లో సందడి చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బ్రో ని ఓటిటీ లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం ఓటిటీ ఆడియన్స్ ముందు బ్రో అఫీషియల్ గా దిగబోతుంది.