సమంత ఖుషి ప్రమోషన్స్ కంప్లీట్ చేసేసి అమెరికా వెళ్లిపోయింది. గత శుక్రవారమే సమంత అమెరికా ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. తన హెల్త్ రీజన్స్ వలనే ఆమె అమెరికా వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఖుషి షూటింగ్ ఫినిష్ చేసిన సమంత బాలిలో తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసి వచ్చింది. అక్కడే మార్నింగ్ వాక్, వర్కౌట్స్, డాన్స్ తో ఛిల్ అయిన సమంత హైదరాబాద్ వచ్చి ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొంది. విజయ్ దేవరకొండ తో కలిసి డాన్స్ అంటూ రెచ్చిపోయింది.
ఇక అమెరికా వెళ్లినా, హైదెరాబాద్ లో ఉన్నా, వెకేషన్స్ కి వెళ్లినా, షూటింగ్స్ కి హాజరయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా తాను కొత్త ప్రేమని కనుగొన్నాను అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఓ గ్లాస్ వాటర్ ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమని కనుగొన్నాను అంటూ.. కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అంటూ ఎమోజిలానీ షేర్ చేసింది.
అదే ఫొటోలో సమంత చేతికి ఉన్న ఓ బ్రేస్ లేట్ కూడా అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం సమంత ట్రీట్మెంట్ లో ఉండడంతో ఆమె తరచూ అమెరికా వెళ్లాల్సి రావడంతో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఒప్పుకోలేదని.. ఇంతకుముందు ఒప్పుకున్న ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ ని కూడా పంటి బిగువున పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.