సంతోష్ శోభన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టంగా కనిపిస్తుంది. వరసగా డిజాస్టర్స్ మీద డిజాస్టర్స్ మీద పడుతున్నాయి. ఈ ఏడాది ఏకంగా నాలుగు డిజాస్టర్స్ చవి చూశాడు. కళ్యాణం కమనీయం అంటూ చిరంజీవి-బాలకృష్ణ మధ్యలో నలిగిపోయాడు. తర్వాత సుస్మిత కొణిదెల నిర్మాతగా వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు అయితే అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత అన్ని మంచి శకునములే అంటూ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తే అది కూడా సంతోష్ ని అందుకోలేకపోయింది. ఈ కుర్ర హీరో సినిమాలు చేసే మీద ఉన్న శ్రద్ద కథలపై పెట్టడం లేదు. అసలు సంతోష్ శోభన్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో అనాసక్తి.
తాజాగా ఈ హీరో నటించిన ప్రేమ్ కుమార్ విడుదలయింది. యాజ్ యూజువల్ గా ఆ సినిమాని కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు. ఏ విధంగానూ ఈ సినిమా మెప్పించలేదు. కామెడీ కొరత, కథా లోపం, బలమైన కేరెక్టర్స్ లేకపోవడం, ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడం, నిరాసక్త కథనం, వీక్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ప్రేమ కుమార్ ని ప్రేక్షకులు రిజెక్ట్ చేసేలా చేసాయి. ఏదీ నేచురల్ గా జరుగుతున్నట్టు ఉండదు. అంతా సినిమాటిక్ వే లో ఉంటుంది.
మరి ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు ఒక్క ఏడాదిలో సంతోష్ శోభన్ నాలుగు డిజాస్టర్స్ అందుకున్నాడు. పాపం ఈ కుర్ర హీరోకి ఓ మంచి కథ దొరికి.. ఓ మంచి దర్శకుడు తగిలితే సంతోష్ శోభన్ కాస్త గాడిలో పడతాడు. అసలు ఇప్పటికే సంతోష్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అసలెందుకు వస్తున్నాడురా బాబు అనుకుంటున్నారు. ఇకపై అయినా మంచి సినిమా చేసి హిట్ కొట్టకపోతే ఈ హీరో దుకాణం సర్దేసుకోవాల్సిందే.