యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంది. తనని ట్రోల్స్ చేసేవారిని, తనపై కామెంట్స్ చేసేవారిని దైర్యంగా ఎదుర్కునే అనసూయ ఇలా కన్నీళ్లు పెట్టడం చూసి ఆమె అభిమానులే షాకైపోతున్నారు. కన్నీళ్లు కాదు వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ వీడియోని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేసింది. ఆ వీడియో తో పాటుగా ఇలా రాసుకొచ్చింది.
సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి వినియోగిస్తాము. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాని వాడతాం. ఒకరిని ఒకరు పలకరించుకోవడానికి, బాగోగులు తెలుసుకోవడానికి, విజ్ఞాన్ని పెంచుకోవడానికి సోషల్ మీడియాని వినియోగిస్తాము. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను దాని కోసమే వాడుతున్నామా? మన బాగు కోసం ఉపయోగించుకుంటున్నామా? ..
సోషల్ మీడియాలో నేను సరదాగా తీయించుకున్న ఫోటో షూట్లు, నవ్విన నవ్వులు.. వేసిన డాన్స్ లు, వేసిన స్ట్రాంగ్ కౌంటర్లు, నేను ఇచ్చిన కమ్ బ్యాక్‌లు, ఇవన్నీ కూడా నా జీవితంలోని భాగాలే, నేను బాగా లేని టైం, కష్టాల్లో ఉన్న టైం, ఇలా ఏడుస్తూ బ్రేక్ అయిన సందర్భాల గురించి ఎక్కువగా చెప్పుకోలేదు.. ఓ పబ్లిక్ ఫిగర్‌గా నేను నా అభిప్రాయాలు నిక్కచ్చిగా చెబుతుంటాను.
కొన్ని కొన్ని సార్లు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది అయినా నేను వాటిని పట్టించుకోకుండా. ఓ రెండు మూడు రోజులు బాధపడి.. మళ్లీ నవ్వుతూనే బయటకు వస్తాను. రెస్ట్ తీసుకుంటాను. రీఛార్జ్ చేసుకుంటాను. కానీ సమస్యల నుంచి పారిపోను. ఎదుటి వారు మనకు ఏం చేసినా సరే వారిపై జాలి చూపించండి. కొంతమంది కష్టాలు వస్తే వారికి అండగా ఉండండి. మంచిగా ఉండండి. వాళ్లే మళ్లీ మీ వద్దకు వస్తారు. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఐదు రోజుల క్రితం నాకు బాగా లేకపోతే ఇలా రికార్డ్ చేసి మెమోరీగా పెట్టుకున్నాను. అంటూ అనసూయ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
అయితే అనసూయ అలా ఏడుస్తూ వీడియోని షేర్ చేసింది.. తనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి అనసూయ ఇలా చాలా ఫీలవుతుంది అని తెలుస్తుంది.