ఖుషికి సంబందించిన ఒకటి రెండు ప్రమోషన్స్ పూర్తి చేసుకుని సమంత అమెరికా వెళ్ళిపోయింది. ఆమె తన హెల్త్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా.. మధ్యలో ఖుషి ప్రమోషన్స్ కోసం ఆమె ఒక 20 డేస్ ఇక్కడే ఉండిపోయింది. ఈమధ్యలో సమంత బాలి వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యి వచ్చింది. అక్కడ నుండి వచ్చాక సమంత ఖుషి కాన్సెర్ట్ లో పాల్గొంది. స్టేజ్ మీద సమంత విజయ్ తో కలిసి డాన్స్ తో అదరగొట్టేసింది.
అదే స్టేజ్ పై విజయ్ దేవరకొండ సమంత హెల్త్ ఇంకా సెట్ కాలేదు అంటూ చెప్పాడు. అలాగే సమంత కూడా కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని నీరసంగానే కనిపించింది. ఇక ఓ కామన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నిన్న శుక్రవారం అమెరికాకి వెళ్ళిపోయింది. అక్కడ అమెరికాలో హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్ది రోజులు అక్కడే ఉంటుందట. అయితే సమంత తరుచూ అమెరికా వెళ్ళాల్సి వస్తుందట.
అందుకే సమంత ఏ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సీరీస్ పూర్తి చేసుకుంది.. సమంత అమెరికా నుండి వచ్చాక దాని ప్రమోషన్స్ లోను పాల్గొంటుంది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళుతుందట. అందుకే ఓ ఏడాదిపాటు ఎలాంటి ప్రాజెక్ట్ సమంత ఒప్పుకోవడం లేదు.