గత కొన్నేళ్లుగా ఒకే ఒక్క హీరోయిన్ పలు సినిమాల్లో నటించడం పెద్దగా కనిపించలేదు.. వరస సినిమాలతో సందడి చేసిన సందర్భము లేదు. కానీ ఇప్పుడు శ్రీలీల మాత్రం ఆ రేర్ ఫీట్ ని అందుకోబోతుంది. ఈఏడాది శ్రీలీల ఇకపై నెలకో సినిమాతో సందడి చెయ్యడానికి రెడీ కాబోతుంది. ఎక్కడ చూసినా శ్రీలేల పేరే.. సోషల్ మీడియాలో రోజుకోసారి ట్రెండింగ్ లోకి వస్తుంది. అది చూసిన ఆమె అభిమానులు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
అయితే శ్రీలీల ప్రస్తుతం రామ్ తో చేస్తున్న స్కంద సాంగ్స్ లో డాన్స్ స్టెప్స్ తో ఇరగదీస్తోంది. రామ్ తో కలిసి అదిరిపోయే డాన్స్ వేస్తూ అందరిని ఆకర్షిస్తుంది. ఆమె లుక్స్, డాన్స్ స్టెప్స్, అవుట్ ఫిట్స్ అన్ని ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 15 న రామ్ స్కందతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరితో ఆడియన్స్ ముందుకు వచ్చేసినందుకు రెడీ అవుతుంది. ఆ తర్వాత నవంబర్ 10న ఆదికేశవ్ గా వైష్ణవ తేజ్ తో వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అసలైతే ఈ చిత్రం ఆగష్టు 18 అంటే నిన్న
ఆదికేశవ్ విడుదల కావాల్సి ఉంది.. కానీ అది పోస్ట్ పోన్ అయ్యి నవంబర్ కి షిఫ్ట్ అయ్యింది. ఇక డిసెంబర్ లో నితిన్ తో ఎక్స్ట్రా తో రాబోతుంది. ఇలా ఈ ఏడాది చివరి వరకే కాదు.. వచ్చే ఇది జనవరిలోను శ్రీలీల గుంటూరు కారం భారీ బడ్జెట్ మూవీతో రాబోతుంది.