మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ దగ్గరనుండి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, చరణ్ ఇలా ఫ్యామిలీ అంతా ఆయనకి అండగా నిలబడ్డారు. తర్వాత చిరు ఆ పార్టీ మూసేసారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు మెగా ఫ్యామిలీ ఆయనకి సపోర్ట్ చెయ్యనట్టే కనిపించారు. తర్వాత రామ్ చరణ్, నాగబాబు ఈమధ్యన చిరంజీవి కూడా తమ్ముడికి మద్దతు ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేనకు అల్లు ఫ్యామిలీ కాస్త దూరంగానే ఉంటుంది.
ఇప్పుడు ఆ దూరం మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తుంది. కారణం అల్లు అర్జున్ తన మామగారు, స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ కి సపోర్ట్ చెయ్యడమే. బీఆర్ఎస్ నేతగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఫేమస్ పొలిటిషన్. 2014 ఎన్నికల్లో ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన తన సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. తాజాగా చంద్రశేఖర్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అల్లు అర్జున్ తనకి సపోర్ట్ చెయ్యలేదు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.. కానీ ఈసారి తనకి బన్నీ సపోర్ట్ ఉంటుంది.. ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం భట్టుగూడెం వద్ద చంద్రశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఈరోజు శనివారం ఈ ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అందరు మామా-అల్లుళ్ళు ఎలా ఉంటారో నేను బన్నీ కూడా అలానే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో అల్లు అర్జున్ సపోర్ట్ తనకి ఉంటుంది అని చెప్పారు.
దీనిని బట్టి అల్లు అర్జున్ మామగారు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే.. ఆయనకి బన్నీ ప్రచారం చేస్తే మెగా ఫ్యామిలి కొత్త కుంపటేగా.. మరి మెగా ఫ్యామిలీ సపోర్ట్ జనసేన పవన్ కళ్యాణ్ కి ఉంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ సపోర్ట్ బీఆర్ఎస్ చంద్రశేఖర్ కి ఉంటుంది. అది ఆంధ్ర-ఇది తెలంగాణ అనుకున్నప్పటికీ.. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు జనసేనతో యాక్టీవ్ గా కనిపిస్తారు కూడా.