మా అధ్యక్షడిగా మంచు విష్ణు ఎప్పుడైతే పోటీ చేశాడో అప్పటినుండి మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇది వాస్తవం. అయితే మంచు హీరోలు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది అనే నానుడి ఉంది. మోహన్ బాబు కూడా ఒక్కోసారి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. అందుకే మంచు ఫ్యామిలీపై తరచూ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ ట్రోలర్స్ కి మంచు విష్ణు గట్టిగానే రిప్లై ఇస్తూ.. పోలీస్ కంప్లైంట్ చేసినా ఈ ట్రోల్స్ ఆగేవి కాదు. తాజాగా మంచు విష్ణు కన్నప్ప అనే బిగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఆ మూవీ ఓపెనింగ్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ట్రోల్స్ చేస్తుంది ఇండస్ట్రీ లోని వారే.. అది కూడా స్నేక్ బ్యాచ్ అంటూ విష్ణు సెన్సేషనల్ గా మాట్లాడాడు. తాను మా అధ్యక్షుడిగా పోటీ చెయ్యక ముందు తనపై, ఫ్యామిలీపై ఎలాంటి ట్రోల్స్ వచ్చేవి కాదు.. కానీ మా మధ్యక్షుడిగా పోటీ చేశాకే తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. అవి ఎవరు చేస్తున్నారు, చేయిస్తున్నారో అనేది అందరికి తెలుసు. అదొక స్నేక్ బ్యాచ్ పని అని చెప్పిన మంచు విష్ణు.. ఈరోజుల్లో ట్రోల్స్ సర్వసాధారణం అయ్యాయి.. కానీ ఆ ట్రోల్స్ వలన ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాను ట్రోల్స్ కి భయపడను అని చెప్పిన మంచి విష్ణు తమపై వచ్చే కొన్ని కామెంట్స్ చూసి నవ్వుకుంటామని.. అవి సరదాగా అనిపిస్తాయని.. కొన్నిసార్లు మాత్రం అవి శృతి మించిపోవడంతోనే అసలు ప్రాబ్లెమ్ స్టార్ట్ అవుతుంది అంటూ మంచు విష్ణు మాట్లాడాడు.