సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై ఇప్పటీకి ఎనిమిది రోజులయ్యింది. ఇప్పటికీ జైలర్ హవా థియేటర్స్ లో కొనసాగుతుంది. వారం కాక ముందే కమల్ హాసన్ విక్రమ్ టోటల్ కలక్షన్స్ అంటే 400 కోట్ల మార్క్ ని చేరుకుంది జైలర్. ఎన్నో ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ ఈ రేంజ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. ఇంత సక్సెస్ అయిన సినిమాలో హీరోయిన్ గా కనబడిన తమన్నా మాత్రం విల విలలాడుతుంది.
కారణం జైలర్ మూవీని తమన్నా కేవలం ఓ సాంగ్ కోసం రెండు సీన్స్ కోసమే సినిమా ఒప్పుకుంది అనిపించేలా ఆమె పాత్రని నెల్సన్ దిలీప్ డిజైన్ చేసాడు. నువ్ కావాలయ్యా అంటూ సోషల్ మీడియాలో హడావిడి తప్పితే జైలర్ సక్సెస్ లో తమన్నా భాగం కాలేక విలవిలలాడుతోంది. జైలర్ లో తమన్నా గ్లామర్ షోకి, అది కూడా నువ్ కావాలయ్యా సాంగ్ కి పరిమితమవడంతో 400 కోట్ల హిట్ ని ఎంజాయ్ చేయలేకపోతోంది.
నిజంగా తమన్నా పాత్ర నిడివి మరికాస్త ఉంటే ఆమె కూడా జైలర్ సక్సెస్ ని హ్యాపీ గా పంచుకునేది. టీం తో కలిసి హడావిడి చేసేది. కానీ సోషల్ మీడియాలో తన ఫోటోలని, నువ్ కావాలయ్యా సాంగ్ ని ప్రమోట్ చేసుకుని మురిసిపోతుంది. ఇటు తెలుగులో కూడా తమన్నాకి భోళా శంకరుడు బిగ్ షాక్ ఇచ్చాడు.