Advertisementt

గ్రాండ్ గా బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ వివాహం

Sat 19th Aug 2023 08:48 AM
brahmanandam  గ్రాండ్ గా బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ వివాహం
Brahmanandam son Siddharth wedding గ్రాండ్ గా బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ వివాహం
Advertisement
Ads by CJ

హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు.

సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు...

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Brahmanandam son Siddharth wedding :

Celebrities at Brahmanandam son Siddharth wedding 

Tags:   BRAHMANANDAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ