లైగర్ సినిమా ప్లాప్ తర్వాత అభిమానులకి దగ్గరగా ఉండేందుకు విజయ్ దేవరకొండ రకరకాలుగా ప్రయత్నాలు చేసాడు. ఏదో విధంగా హడావిడి చేసాడు. ఇప్పుడు తన నుండి రాబోతున్న ఖుషి పై లైగర్ డిసాస్టర్ ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటున్నాడు. దాని కోసం ఖుషి ప్రమోషన్స్ లో కొత్తగా కాదు చెత్తగా ట్రై చేస్తున్నాడు. దానితో నెటిజెన్స్ నుండి ట్రోల్ అవుతున్నాడు.
ఓ నెటిజెన్ విజయ్ దేవరకొండ ఖుషి కాన్సెర్ట్ లో చేసిన డాన్స్ పై ఈ విధంగా స్పందించాడు.
సినిమా ఆడాలంటే.. సమంతా.. విజయ్ దేవరకొండ లా స్టేజ్ మీద బట్టలిప్పి తిరగాల్నా ??
బలగం సినిమా బట్టలిప్పి తిరిగితే...ఆడిందా ?
కాంతారా లో ఏ కాంత ని చూసి హిట్ చేశారు ?
నిన్న కాక మొన్న వచ్చిన జైలర్ లో హీరోకి ఏ సిక్స్ ప్యాక్ ఉంది ?
ప్రేక్షకుల్ని అంత తక్కువ అంచనా వేయకండి.
కథలో కంటెంట్ ఉండాలి. నటన తెలియాలి. సినిమా ని సినిమా లా తీయాలి.
లవకుశ అప్పట్లో టికెట్ పావలా ఉంటే.. కోట్ల రూపాయలు వసూలు చేసింది. విడుదల అయిన అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది..
బనియన్ లు ఏసుకుంటే.. ఎగేసుకొని చూస్తారనుకోవడం మీ భ్రమ..!!
బట్టలేసుకోవడమే రానోళ్ళు బ్లాస్ట్ అవడం తప్ప బ్లాక్ బస్టర్లు కాలేరు.