Advertisementt

ఇది సొంత పత్రిక.. అది దత్త పుత్రిక

Fri 18th Aug 2023 07:29 PM
ycp  ఇది సొంత పత్రిక.. అది దత్త పుత్రిక
YCP To Sweep In AP ఇది సొంత పత్రిక.. అది దత్త పుత్రిక
Advertisement

అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎప్పుడు ఎన్నికలంటే పక్కా క్లారిటీ లేదు.. కానీ సర్వేల మీద సర్వేలు. దేశంలో కూడా ఇన్ని సర్వేలు జరగట్లేదు బాబోయ్.. కేవలం ఏపీలోనేనా? సీఎం జగన్ అంటే సర్వే చేసేవారికి ఎందుకంత ప్రేమ. తెలుగు, ఆంగ్లం అన్న తేడా లేకుండా తెగ సర్వేలు చేసేసి జగన్‌కు బులిటెన్ మెజారిటీ కట్టబెడుతున్నారు. టైమ్స్ సంస్థకు చెందిన ఈటీజీ రిసెర్చ్ సంస్థ ఈ సర్వేలు చేస్తోంది. ఏకంగా వైసీపీకి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. అసలు అంపైర్.. బ్యాట్స్మన్, బౌలర్. వికెట్ కీపర్ అన్నీ ఒక్కరే చేస్తే.. ఫలితం ఏంటో చెప్పాలా? ఇప్పటికే టైమ్స్‌కి తమ ఇమేజ్‌ను ప్రమోట్ చేసేందుకు పాతిక కోట్లు కట్టబెట్టి.. మళ్లీ అదే సంస్థతో సర్వేలా? ఏంటి కామెడీయా? వినేవాడు వెర్రిపుష్పం అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అట.

పోనీ.. సంస్థ సర్వే చేసింది.. మొత్తం సీట్లన్నీ వైసీపీకే వస్తాయి.. ప్రతిపక్షాలకు గుండు సున్న అని చెప్పింది. కానీ దీనికి క్రెడిబులిటీ ఎంత? సర్వేలు ఎప్పుడు నమ్మొచ్చంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక.. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యాక.. ప్రచారంలో ఆ అభ్యర్థులంతా తాము చెప్పుకోవల్సింది.. ఇచ్చుకోవల్సింది పూర్తయ్యాక చేస్తే అది దాదాపుగా ఫిక్స్‌డ్ ఫలితం. ఇక్కడ ఏది లేదు కానీ ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటే ఎలా? అసలు సాక్షి పత్రికలో వైసీపీ గెలుస్తుందని వస్తే ఎంతగా అయితే నమ్మొచ్చో ఈజీటీ సంస్థ చెప్పినా అంతే. ఇది సొంత పత్రిక.. అది దత్త పుత్రిక. తేడా ఏమీ లేదు. రెండూ సేమ్ టు సేమ్. అసలు ఈ ఈటీజీ మూలాలు చూస్తే మళ్లీ జగన్ కుటుంబంలోనే దర్శనమిస్తాయి.

ఈటీజీ రీసెర్చ్ సంస్తను నడుపుతున్న నవనీత్ కుమార్.. జగన్‌ కార్యాలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఇరగవరపు అవినాశ్‌కు చెందిన విదుర స్ట్రాటజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయనది కీలక పాత్ర. అదీ అసలు కథ. జనాలను సోమరిపోతులను చేసేందుకు.. అదేలెండి వైసీపీ వారి భాషలో ఉద్దరించేందుకు అమలు పరిచిన సంక్షేమ పథకాలు తప్ప చెప్పుకోవడానికి ఏముంది? ఏం చూసి జనాలు వైసీపీ పల్లకిని మోస్తారు? అదేమైనా తిరుమల శ్రీవారి పల్లకియా? పుణ్యమొస్తుందని మోయడానికి? 30 ఏళ్ల పాటు జగనే సీఎం అంటూ జ్యోతిషులతో ఇంటర్వ్యూలు.. ఇలాంటి బోగస్ సర్వేలతో వైసీపీకి లాభం చేకూరుతుందా? ఇప్పటికైనా అంతర్గత కలహాలు వీడి.. కలిసి కట్టుగా జనంలోకి వెళ్లాలి. అధినాయకుడు సైతం అసలు జనాల సమిష్టి ప్రయోజనాలపై దృష్టి సారించాలి. అప్పుడే ఏమైనా విజయం గురించి ఆలోచించవచ్చు.

YCP To Sweep In AP:

YCP To Sweep In AP: Times Now - ETG Survey

Tags:   YCP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement