అభిమానులు ఈమధ్యన ఎంతెలా చెలరేగిపోతున్నారో అనేది తరచూ చూస్తూనే ఉన్నాము. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ల సమయంలో అభిమానులు రెచ్చిపోయి టపాసులు కాలుస్తూ.. తెరలకి మంటలు అంటిస్తూ.. థియేటర్ అద్దాలను రాళ్లతో బద్దలు కొడుతూ, కూర్చులని విరగ్గొడుతూ నానా రచ్చ చేస్తున్నారు.
తాజాగా ప్రభాస్ నటించిన యోగి మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఫాన్స్ ఈరోజు ఆగష్టు 18 న నంద్యాల రాజ్ థియేటర్ లో యోగి రీరిలీజ్ సందర్బంగా సంబరాలు చేసుకుంటూ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా.. థియేటర్ స్క్రీన్ రెండు చోట్ల చిరిగిపోయి బాగా డామేజ్ అయింది.
ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం రాజ్ థియేటర్ స్క్రీన్ చిరిగిపోవడానికి కారణమైంది. అభిమానులకి పిచ్చ ఉండొచ్చు.. కానీ ఈ రకమైన వెర్రి ఉండడం కరెక్ట్ కాదని నెటిజెన్స్ కాస్త గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు.