మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య నుండి విడాకులు తీసుకుని తల్లితండ్రులతో కలిసి ఉంటుంది. విడాకుల విషయాన్ని రీసెంట్ గానే బయటపెట్టిన నిహారిక ఆ తర్వాత షూటింగ్స్ అంటూ సోషల్ మీడియాలో బాగా బిజీగా కనబడుతుంది. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం సోల్ అఫ్ సత్య కి సంబంధించిన ఓ సాంగ్ ఆగష్టు 15న విడుదలైంది.
ఆ సాంగ్ కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టుగా నిహారిక ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కి ఓ నెటిజెన్ రిప్లై ఇస్తూ.. వీటి మీద ఉన్న శ్రద్ధాసక్తులు కుటుంభంపై లేకపోయెను అంటూ ఇండైరెక్ట్ గా నిహారిక తన భర్త, ఫ్యామిలీతో సఖ్యత లేని కారణంగానే విడాకులు తీసుకుంది అనేలా కామెంట్ చేసాడు. దానితో సాయి ధరమ్ తేజ్ కి బాగా కోపమొచ్చింది. నోరు అదుపులో పెట్టుకో వెంటనే ఆ కామెంట్ డిలేట్ చెయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆ నెటిజెన్ కి.
దీనిని బట్టి మెగా ఫ్యామిలీ నిహారికకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో అనేది అర్ధమవుతుంది. తన మరదలిని ఎవరైనా కామెంట్ చేస్తే బావ ఊరుకుంటాడా.. ఇక్కడ సాయి ధరమ్ తేజ్ కూడా నిహారికని కామెంట్ చేసిన వ్యక్తికి గట్టిగా ఇచ్చిపడేసాడు.