సాయి ధరమ్ తేజ్ యాక్సియెంట్ తర్వాత ఇబ్బంది పడినా.. కెరీర్ పరంగా రిపబ్లిక్-విరూపాక్ష సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గానే మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన స్నేహితుల కోసం పారితోషకం ఎక్స్పెక్ట్ చెయ్యకుండా ఓ షార్ట్ ఫిలిం లో నటించాడు.
సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు నవీన్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రొజులుగా నటనకు బ్రేక్ తీసుకున్న నవీన్ దర్శకుడుగా మారాడు. నవీన్ తన స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ తొ ఒక షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించాడు.. ఈ షార్ట్ ఫిలిం కి మరో స్నేహితుడు దిల్ రాజు గారి అబ్బాయి హర్షిత్ రెడ్డి నిర్మాత. ఈ షార్ట్ ఫిలిం కి సంబందించిన సాంగ్ ని ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చెయ్యగా ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ నచ్చి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన స్నేహితుల కొసం రెమ్యునేషన్ కూడా తీసుకొకుండా యాక్ట్ చేసాడు.