బాహుబలితో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారడానికి రాజమౌళి కారణమనే చెప్పొచ్చు. అంటే ప్రభాస్ నటన, ఆయన కష్టం కూడా అందుకు 100 పర్సెంట్ కారణం. కానీ ప్రభాస్ ని బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాజమౌళి ఎంతగా శ్రమించి ప్రమోషన్స్ చేసారో.. ప్యాన్ ఇండియాలోని పలు భాష ప్రేక్షకులకి ప్రభాస్ ని ప్రెస్ మీట్స్ తో ఇంట్రడ్యుస్ చెయ్యడం ఇలా. బాహుబలి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది ప్రమోషనల్ కార్యక్రమాలే.
అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసినా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ కి అతి కీలకమైన ఆ ప్రమోషన్స్ ని పట్టించుకోలేదు. ఈ సినిమాలన్నిటికి ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ప్రభాస్ సరిపెట్టేసారు. ఇంటర్వూస్ కూడా లేవు. సాహో అప్పుడు అంతే, రాధే శ్యామ్ విషయంలోనూ అంతే, నిన్నగాక మొన్న వచ్చిన ఆదిపురుష్ కి అంతే చేసారు.
ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే జరగబోతుందా.. ప్రశాంత్ నీల్ KGF ని పలు భాషల్లో తెగ ప్రమోట్ చేసారు. కానీ సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ కూడా లైట్ గా కనిపిస్తున్నారు. సలార్ విడుదలకు కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. అని ఇంతవరకు సలార్ ప్రమోషన్స్ మొదలు కాలేదు. పాటల పరిస్థితి ఏమిటో.. సలార్ కి కూడా ఒక్క ఈవెంట్ తోనే సరిపెట్టేస్తారా.. ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా సలార్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తే బావుంటుంది అని ప్రభాస్ ఫాన్స్ ఆలోచన. కానీ ఇప్పుడు సలార్ విషయంలో ఏం జరుగుతుందో తెలియక ప్రభాస్ ఫాన్స్ అయోమయంలో ఉన్నారు.