థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బేబీ మూవీ థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. బేబీ మూవీని భక్తి ఫీల్ తో డిజిటల్ హక్కులు చేజిక్కించుకున్న ఆహా లో బేబి ఓటిటీ ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే కల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల పొందిన బేబి త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరటానికి పరుగులు తీస్తోంది.
ఈ నేపథ్యంలో రూ.899లను చెల్లించిన తన గోల్డ్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్‌కు మరో అపూర్వ అవకాశాన్ని అందించింది ఆహా. ఈ గోల్డ్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంటలు ముందుగానే బేబి సినిమాను చూడబోతున్నారు. ఈ గోల్డ్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్ తీసుకున్న వారు సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూసేటప్పుడు 4K డాల్బీ ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు.
ఈ సదుపాయం ఇటు తెలుగు, అటు తమిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోని సబ్ స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉంది. ఆహా సబ్ స్క్రిప్షన్‌లో చాలా మార్పులను చేసింది. దీని కారణంగా ఎస్‌వీఓడీ (సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్)లో చాలా గొప్పగా నెంబర్స్ నమోదు అయ్యాయి. అలా ఆగష్టు 25 నుండి బేబీ ఆహా ఓటిటీ లోకి అందుబాటులోకి రానుంది.