వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆగష్టు 24 న వరుణ్-లావణ్యల వివాహం ఇటలీలో జరుగుతుంది, అది కూడా డెస్టినేషన్ స్టయిల్లో ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన అనే ప్రచారం జరిగినా అది జస్ట్ రూమర్ అని తేలిపోయింది. కారణం ఆగష్టు 24 కి కేవలం వారం మాత్రమే సమయం ఉంది. ఇప్పటివరకు పెళ్లి కార్డుల పంపకాలు లాంటివి కానీ, పెళ్ళికి సంబందించిన పనులేవి నాగబాబు ఇంట మొదలు కాలేదు. అయితే తాజాగా వరుణ్ తేజ్ తన పెళ్లి పై లావణ్య తో ప్రేమపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
లావణ్యతో ప్రేమ మొదలై ఐదేళ్లు దాటిపోయింది. ముందుగా మేము మంచి స్నేహితులం, తర్వాత మరో అడుగు ముందుకేశాము. లావణ్య త్రిపాఠికి నా గురించి నా సింప్లిసిటీ గురించి అన్ని తెలుసు, తాను నాకు బోలెడన్ని గిఫ్ట్ లు ఇస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ కూడా అలాంటిదే. లావణ్య త్రిపాఠికి నాకేం కావాలోబాగా తెలుసు. ఇక నేను కాస్త లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తాను, పర్సనల్ విషయాలు ఓపెన్ అవ్వను. అందుకే మా ప్రేమ విషయం ఇన్నాళ్లు బయటపెట్టలేదు.
నేను లావణ్య మా నిశ్చితార్ధాన్ని ఎంత సింపుల్ గా చేసుకున్నామో.. పెళ్లి కూడా అంతే సింపుల్ గా జరగాలని కోరుకుంటున్నాము.. అంటూ వరుణ్ తేజ్ తన పెళ్లిపై, లావణ్యతో ప్రేమపై గాండీవధారర అర్జున సినిమా ప్రమోషన్స్ లో బయటపెట్టాడు.