Advertisementt

టైగర్ టెర్రర్ పుట్టించేస్తున్నాడు

Thu 17th Aug 2023 04:27 PM
tiger nageswara rao  టైగర్ టెర్రర్ పుట్టించేస్తున్నాడు
Tiger Nageswara Rao Teaser Review టైగర్ టెర్రర్ పుట్టించేస్తున్నాడు
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ ఎంతో నమ్మి చేస్తోన్న సినిమా, మరెంతో కష్టపడి చేస్తోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. కొత్త దర్శకుడైనా.. రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా బిలీవ్ చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ శారీరక కష్టాన్ని కూడా భరిస్తూ చేస్తోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. తెలుగు రాష్ట్రాల్లో మాస్ మహారాజాగా వెలుగుతున్న రవితేజకి ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా తాలూకు టీజర్ ఈ రోజు బయటికి వచ్చింది. అదెలా ఉందంటే.. 

నిజంగా ప్యాన్ ఇండియా సినిమా స్థాయికి తగ్గట్టే ప్రతి షాటు, ప్రతి ఫ్రెము పర్ ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. మరోసారి మన తెలుగు సినిమా కథ దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించే సూచనలు తెలుస్తున్నాయి. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ టీజర్ కట్ గా అనిపించుకునేలా ఉంది టైగర్ నాగేశ్వరరావు. కథేమిటో చెబుతూనే కథానాయకుడిని మాత్రం దాచడం హైలెట్ ఈ టీజర్ లో. 

చాలామందికి మింగుడు పడదు. ఇంకొంతమందికి అర్ధం కాదు. కానీ ఈ సినిమా ఏదో ఓ సునామి సృష్టించేలానే ఉంది. అది విజయం వైపా.. కాదా.. అన్నది వేచి చూద్దాం. టైగర్ కైతే టైమ్ వచ్చేసినట్టే కనిపిస్తుంది. టైగర్ టీజర్ టెర్రిఫిక్ గానే వినిపిస్తోంది. 

Tiger Nageswara Rao Teaser Review:

Ravi Teja Tiger Nageswara Rao Teaser Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ