Advertisementt

ఈ ట్రెండ్ లో ఈ ఘనత శంకర్ కే సొంతం

Thu 17th Aug 2023 03:22 PM
shankar  ఈ ట్రెండ్ లో ఈ ఘనత శంకర్ కే సొంతం
Only Shankar could do it ఈ ట్రెండ్ లో ఈ ఘనత శంకర్ కే సొంతం
Advertisement
Ads by CJ

గతంలో దర్శకులు ఒకేసారి రెండు మూడు సినిమాలని సెట్స్ మీద పెట్టి .. హీరోల డేట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేవారు. రాఘవేంద్రరావు, దాసరి ఇలా చాలామంది దర్శకులు డే అండ్ నైట్ ఏమిటి రోజుకి మూడు షిఫ్ట్ లు పనిచేసేవారు. ఏడాదికి బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చేవారు. తర్వాత కూడా చాలామంది దర్శకులు ఏడాదికి రెండు మూడు సినిమాల షూటింగ్స్ తో సందడి చేసారు. కానీ ఈమధ్య కాలంలో ఏడాదికి ఒక్క సినిమా చెయ్యాలన్నా దర్శకులకి గగనమైపోతుంది. ఏడాదికి సరేసరి రెండేళ్ళకి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

పుష్ప తర్వాత సుకుమార్, అలా వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్, ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి, ఆచార్య తర్వాత కొరటాల శివ ఇలా టాప్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. హిట్ కొట్టిన మీడియం రేంజ్ దర్శకులు కూడా ఏడాదికి ఒక్కసారి కనిపించడం కష్టమైపోతుంది. ఆర్.ఆర్.ఆర్ వచ్చి ఏడాదిన్నర పూర్తవుతుంది.. కానీ ఇంతవరకు రాజమౌళి కొత్త సినిమా మొదలు కాలేదు, సుకుమార్ పుష్ప1 వచ్చి వచ్చే డిసెంబర్ కి రెండేళ్లు పూర్తవుతుంది, పుష్ప 2 ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక కొరటాల ఆచార్య తర్వాత దేవరని ఏడాదికి గాని మొదలు పెట్టలేదు. అలాగే కోవిడ్ ముందు త్రివిక్రమ్ అలా వైకుంఠపురములోతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తర్వాత ఆయన గుంటూరు కారం వచ్చే ఏడాది 2024లో కానీ ప్రేక్షకుల ముందుకు రాదు. అంటే నాలుగేళ్లు ఆయన సినిమా లేనట్టే.  

తోటి దర్శకులంతా ఇలా ఏడాదికో రెండేళ్లలో ఒక సినిమా చేస్తుంటే.. దర్శకుడు శంకర్ మాత్రం ఒకేసారి రెండు సినిమాలు అది కూడా హై బడ్జెట్ సినిమాలతో హడావిడి చేస్తున్నారు. దర్శకులు ఎక్కడో అరుదుగా రెండు సినిమాలని ఒకేసారి హ్యాండిల్ చేస్తూ కనిపిస్తారు. శంకర్ ఇప్పుడు ఇండియన్ 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అంటూ రెండు హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 

మరి నిజంగా ఇది చాలాపెద్ద విషయం. ప్రస్తుతం ఏ దర్శకుడైనా హీరోలని సెట్ చేసుకుని సినిమాలు పూర్తి చెయ్యడానికి ఏడాది నుండి రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ శంకర్ అలా కాదు. ఒకేసారి రెండు సినిమాలని పూర్తి చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన రేర్ ఫీట్ సాధిస్తున్నారు. ఈ ట్రెండ్ లో ఈ ఘనత శంకర్ కే సొంతం

ఈరోజు ఆగష్టు 17 శనకర్ పుట్టిన రోజు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్ లో శంకర్ గారి బర్త్ డే వేడుకలు గత రాత్రి సెలెబ్రేట్ చేసింది చిత్ర బృందం. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న దర్శకుడు శంకర్ కి సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

Only Shankar could do it:

Shankar is a rare feat with two films at the same time

Tags:   SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ