విజయ్ దేవరకొండ మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు, ఒకవేళ జరిగితే జరగొచ్చు అంటూ తాను నటించిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టారు. కొన్నాళ్లుగా రష్మిక మందన్నతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విజయ్ రష్మికని పెళ్లాడుతాడేమోలే అనుకున్నారు. కానీ వారు ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఖుషి ప్రమోషనల్ ఇంటర్వూస్ లో హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండకి కాబోయే భార్య ఎలా ఉండాలో, ఎలాంటి లక్షణాలు ఉంటే విజయ్ ఇష్టపడతాడో అనేది రివీల్ చేసింది. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా సింపుల్‌గా ఉండాలి. విజయ్ కుటుంబంతో సులువుగా కలిసిపోవాలి అంటూ సమంత చెప్పడం అది నిజమే అంటూ విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం అనేది అందరిని ఆకర్షించింది.
ఇక విజయ్ గురించి మరింత సమాచారాన్ని ఆ ఇంటర్వ్యూలో సమంత బయటపెట్టింది. విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేస్తాడని, గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడని, విజయ్ కి ఫ్రెండ్స్ ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇక సమంత గురించి కూడా విజయ్ బోలెడన్ని విషయాలని ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన సమంత బెస్ట్ ఫ్రెండ్స్.. సమంతకు ఎంత కోపమొచ్చినా ఆమె అస్సలు బ్యాలెన్స్ కోల్పోదని చెప్పాడు.