మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై వచ్చినన్ని రూమర్స్, ఆ సినిమాకి సంబందించిన వార్తలు కానివ్వండి.. మరే ఇతర సినిమాపై రాలేదనే చెప్పాలి. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో మొదలైన గుంటూరు కారం రేపు సెప్టెంబర్ వస్తే ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు పూర్తయ్యింది. టెక్నీకల్ గా ఎవరెవరు తప్పుకున్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మహేష్ అభిమానులకే అర్ధం కావడం లేదు.
మహేష్ కూడా మూడు షెడ్యూల్స్ నాలుగు విహార యాత్రలంటూ వెళ్లిపోతున్నారు. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ లోనే 15రోజులపాటు గడిపిన మహేష్ రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చారు. లండన్ నుండి తిరిగొచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం కొత్త షెడ్యూల్ లో ఈ నెల మూడో వారం నుండి జాయిన్ అవ్వుతారని నిర్మాత చెప్పారు.
అందుకు అనుగుణంగానే మహేష్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్ వదిలారు. అంటే తాను గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నాను అని చెప్పకనే చెప్పేసారు. ప్రస్తుతం మహేష్ జిమ్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.