ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పరిస్థితి టైటిల్‌లో చెప్పినట్టుగానే ఉంది. చిన్నారిని హత్య చేసిన చిరుత బోనుకి చిక్కింది కానీ.. బాబాయిని హత్య చేసిన అసలు వ్యక్తి మాత్రం సీబీఐకి చిక్కలేదంటే జనాలు వేసే సెటైర్లు.. రోడ్లు వేస్తే సంతోషిస్తారనుకుంటే.. యూత్ ఆ రోడ్లపై సైకిల్స్ వేసుకుని మరీ తిరుగుతూ వెటకారంగా చేసే రీల్స్.. హైదరాబాద్‌లో మాదిరిగా తీగల వంతెన కట్టి ఏపీ జనాన్ని ఆకట్టుకుందామా అంటే.. వీడియోలు చేసి మరీ ఏకి పారేస్తున్నారు. పోయినసారి అంటే కోడికత్తితో కొట్టికొచ్చాం.. అబ్బే ఈసారి ఇవేమీ వర్కవుట్ అయ్యే పనులు కావే.. మూడు రాజధానులంటిమి.. ఒక్క రాజధానికే దిక్కులేకుండా చేస్తిమి..
సంక్షేమ పథకాలతో నెట్టుకొద్దామంటే.. అంతకు మించి ఇస్తామంటున్న టీడీపీ.. పోనీలే.. ఉద్యోగాలిచ్చామని చెప్పుకుందామా? అంటే ఆ ఊసే ఎత్తకపోతిమి.. ఓ రేంజ్‌లో టాప్‌కి ఎదిగామని చెప్పుకుందామా? ఒకే ఒక్క మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో తప్ప ఏ విషయంలోనూ టాప్‌లో లేమే. ఇదేమైనా గొప్పగా చెప్పుకునేదా? కానే కాదు.. మరి ఇంక ఏం చేయాలి? ఐప్యాక్‌ను నమ్ముకుంటే.. వాళ్లిచ్చిన పోస్టర్ ఐడియాకు జనం తిప్పి తిప్పి కొట్టినంత పని చేశారు. మొత్తానికి అధికార పక్షం పరిస్థితి.. అడకత్తెరలో పోకచెక్క. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జనాల్లోకి ఎలా వెళ్లాలి? ఏం చెప్పుకుని వెళ్లాలి? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరోవైపు ఏ జిల్లా చూసినా బీభత్సమైన గ్రూప్ వార్. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా అయ్యింది పరిస్థితి.
అంతకు ముందు అయితే సర్వేలు చేసి రిపోర్ట్ బాగుంటేనే టికెట్ ఇస్తామని గంభీరంగా చెప్పిన జగన్.. ప్రస్తుత పరిణామాలతో స్వరాన్ని తగ్గించేశారు. పులి కాస్త పిల్లి అయిపోయింది. ఇప్పుడు ఉన్న వారిని కాపాడుకోవడమే అతి పెద్ద టాస్క్ అయిపోయింది. ప్రత్యేక హోదా పాయే.. పోలవరం అటకెక్కింది.. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం.. పోనీ వెళ్లి ప్రధాని మోదీని ఎదిరిద్దామా? అంటే చుట్టూ కేసులే.. వాటి నుంచి బయటపడాలంటే ఆయన కరుణ తప్పనిసరి. విద్యుత్ ఉద్యోగుల జీతాలను పెంచి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కానీ మిగిలిన ఉద్యోగులంతా వ్యతిరేకమే కదా. పోస్టులు తీయక నిరుద్యోగులు మాంచి కాకమీదున్నారు. అసలు ఏంటీ అష్టదిగ్బంధనం.. బయటకు వచ్చేదెలా? ఓట్లు అడిగేదెలా? టోటల్‌గా ఏమీ సేతుర లింగా.. ఏమీ సేతూ.. అంటున్నారు జగన్.