Advertisementt

సైలెంట్ మోడ్ లో సలార్

Thu 17th Aug 2023 08:49 AM
salaar  సైలెంట్ మోడ్ లో సలార్
Salaar team in silent mode సైలెంట్ మోడ్ లో సలార్
Advertisement
Ads by CJ

సలార్ విడుదలకి 40 రోజుల టైమ్ మాత్రమే ఉంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28 న విడుదల కాబోతుంది. అయితే సలార్ నుండి టీజర్ లుక్స్ తప్ప మరే ఇతర ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదు. ప్రభాస్-శృతి హాసన్ మధ్యలో ఏమైనా సాంగ్స్ చిత్రీకరించారా.. లేదంటే బ్యాగ్రౌండ్ లో పాటలు పెట్టారా అనే విషయములో అభిమానులకి క్లారిటీ లేదు. 

అయితే తాజాగా ప్రభాస్ బెంగుళూరు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు అంటే ఆగష్టు 18, 19 తేదీల్లో ప్రభాస్ అలాగే సలార్ పాటల రచయిత KK కలిసి బెంగుళూరు వెళ్ళబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్కడ ప్రశాంత్ నీల్-ప్రభాస్ అందరూ మీటవుతారని.. ఆ తర్వాతే ప్రమోషన్స్ ఎక్కడ నుండి స్టార్ట్ చెయ్యాలో అనేది ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. 

అయితే బాలీవుడ్ లో జవాన్ సందడి బాగా ఉంది. సెప్టెంబర్ 8 న జవాన్ విడుదల తర్వాత సలార్ ప్రమోషన్స్ మొదలు పెడితే నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లేదంటే జవాన్ విడుదల హడావిడిలో ఉండి.. సలార్ ని పట్టించుకోరు.. అప్పుడు ప్రమోషన్స్ వేస్ట్ అవుతాయని మేకర్స్ భవిస్తున్నారట. అందుకే జవాన్ వచ్చేవరకు ఈ సైలెంట్ ని ఇలానే మెయింటింగ్ చెయ్యాలని సలార్ టీం డిసైడ్ అయినట్లుగా టాక్. 

Salaar team in silent mode:

Salaar movie update

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ