కీర్తి సురేష్ మహానటి తర్వాత తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఐరెన్ లెగ్ మాదిరిగా మారింది. ఏ సినిమా చేసినా అట్టర్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఆమెతో జోడి స్టార్ హీరోలే పరాజయాలని చవిచూశారు. మళ్ళీ సర్కారు వారి పాట, అలాగే దసరా సినిమాలతో కీర్తి సురేష్ సత్తా చాటుతుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ మొదలు పెట్టింది. అయితే కీర్తి సురేష్ సూపర్ స్టార్-మెగాస్టార్ ఇద్దరిని హోల్సేల్ గా ముంచేసింది. అంటే కీర్తి సురేష్ వలన రజినీకాంత్-చిరంజీవి ఇద్దరూ బలైపోయారు.
హీరోయిన్ గా స్టార్ హీరోల్లో సినిమాలు చేసే కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అన్నత్తే (పెద్దన్న)లో చెల్లెలిగా నటించింది. ఆ చిత్రం అట్టర్ ప్లాప్. కీర్తి సురేష్ చెల్లెలిగా లీడింగ్ రోల్ చేసిన ఆ సినిమా డిసాస్టర్ అయ్యింది. ఇక తాజాగా మెగాస్టార్ కి చెల్లెలిగా భోళా శంకర్ లో నటించింది. అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కిన భోళా శంకర్ ని ఆడియెన్స్ రిజెక్ట్ చేసారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ సంప్రదాయంగా కనిపించింది. సింపుల్ గా ఆకట్టుకుంది. కానీ భోళా శంకర్ రిజల్ట్ తేడా కొట్టింది. మెగాస్టార్-కీర్తి సురేష్ అన్నా చెల్లెళ్ళ కాంబో ఫెయిల్ అయ్యింది. అలా సూపర్ స్టార్ కి మెగాస్టార్ కి కీర్తి సురేష్ లెగ్ షాకిచ్చింది. కీర్తి దెబ్బకి రజిని-చిరు అభిమానులు బేజారైపోయారు.