ఈ రోజుల్లో చాలా మంది.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంపైనే ఫోకస్ అంతా పెడుతున్నారు. అలాంటిది ఓడితే ఇక అటు దిక్కు కూడా చూడరు. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలా కాదు. మంగళగిరి నుంచి ఓడిపోయినా కూడా ప్రజల మధ్యే ఉంటున్నారు. అధికార పార్టీ ఎంత అవహేళన చేసినా కూడా తట్టుకుని నిలబడుతున్నారు. అంతేకాదు.. అధికార పార్టీ సైతం చేయలేని పనులను తన వ్యక్తిగత నిధులతో చేపడుతున్నారు. రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం. కానీ అసలు ఆ ఊసే లేకుండా పని చేయడం చాలా అరుదు. అది ఒక్క నారా లోకేష్‌కే సాధ్యం.
టీడీపీ తరుఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా తాను ఓటమి పాలైన మంగళగిరి నియోజకవర్గంలో అయితే నారా లోకేష్.. జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్యరథాలు, అన్నాక్యాంటీన్లు వంటివి అమలు చేస్తున్నారు. ఇక మహిళలకు కుట్టుమిషన్లు, పని లేని వారికి తోపుడు బళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణకారులకు పనిముట్లు ఇలా కులాల వారీగా కూడా వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. ఇలా మొత్తానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27 సంక్షేమ పథకాలను నారా లోకేష్ అమలు చేస్తున్నారు.
మొత్తానికి నారా లోకేష్ అధికారంలో ఉంటేనే కాదు.. లేకున్నా కూడా తాను ఏం చేయగలననేది చేసి చూపిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ ఊపందుకుంది. ఏ పదవి లేకుంటేనే నారా లోకేష్ ఇంత చేస్తున్నారంటే.. ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంత చేస్తారని చర్చించుకుంటున్నారు. అందుకేనేమో నారా లోకేష్‌కు మంగళగిరిలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఊహించని రీతిలో ఆదరణ లభించింది. ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పుకునే ఏపీ సీఎం జగన్.. ప్రజలకు అత్యవసరమైన కూడు, నీడను దూరం చేశారు. అలాంటిది నారా లోకేష్ మాత్రం ప్రజల్లో ఒకరికి కలియ తిరుగుతూ.. తమకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నారని మంగళగిరి ప్రజానీకం చెప్పుకుంటోంది.