జైలర్ మూవీని ప్యాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు నెల్సన్ దిలీప్ కుమార్ పర్ఫెక్ట్ గా అలోచించి ప్రతి భాషకి ఒక స్టార్ నటుడిని తీసుకొచ్చి గెస్ట్ రోల్స్ చేపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసారు. ఆ విషయంలో నెల్సన్ దిలీప్ ని మెచ్చుకోకుండా ఉండలేము. అయితే కన్నడ, మలయాళం, హిందీ నుండి స్టార్ నటులని ఎంపిక చేసి ఒప్పించి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో నటింప చేసిన నెల్సన్ తెలుగు విషయంలో ఎందుకంత లైట్ తీసుకున్నాడో తెలియదు కానీ.. ఇక్కడ కూడా ఏ బాలకృష్ణనో గెస్ట్ రోల్ కోసం తీసుకొచ్చి జైలర్ లో ఎంట్రీ ఇప్పిస్తే విజిల్స్ కాదు థియేటర్స్ బద్దలైపోయేవి.
జైలర్ మూవీలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రఫ్ వీళ్లందరినీ నెల్సన్ తెలివిగా వాడిన తీరుకి వాళ్ళ ఫాన్స్ కి బాగా నచ్చేయ్యబట్టే ఆయా భాషల్లో జైలర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని కూడా పడెయ్యడానికి ఇక్కడ స్టార్ నటులని నెల్సన్ తీసుకొచ్చి ఉండే బావుండేది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేసారు. ప్రతి భాషలో ఆయా నటుల కేరెక్టర్ హైలెట్ అయ్యి జైలర్ సక్సెస్ లో భాగమయ్యాయి.
తెలుగులో కమెడియన్ సునీల్ ని పెట్టామని మిగతా స్టార్స్ ని పక్కనబెట్టేసినట్టున్నాడు నెల్సన్. కానీ బాలయ్యని ఒప్పించి గెస్ట్ ఎంట్రీ ఇప్పిస్తే జైలర్ కి ఇక్కడ కూడా విత్ప్రీతమైన కలెక్షన్ వచ్చేవి.. థియేటర్స్ లో భీభత్సమైన విజిల్స్ పడేవి. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ భోళా శంకర్ ని పక్కనబెట్టి మరీ జైలర్ కి ఓటేస్తున్నారు.