రాష్ట్రమైనా.. దేశమైనా అభివృద్ధి పథంలో నడవాలంటే ఒక విజన్ ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు హైటెక్ సిటీని తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు నిర్మించారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కు బాటలు వేశాయి. ఆర్థికంగా హైదరాబాదే కాదు.. తెలంగాణ సైతం బలపడింది. అందుకే అభివృద్ధికి విజన్ ముఖ్యం. ఇక ఇప్పుడు చంద్రబాబు పాంచ్ పటాకాతో సిద్ధమయ్యారు. దీన్ని ఫాలో అయితే మాత్రం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయంగానే కనిపిస్తోంది. తాజాగా ఆయన దీనికి సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు.
త్వరలో ఎన్నికలు ఉండటం ఇప్పటికే సగం మేనిఫెస్టో ను బాబు రిలీజ్ చేయడం...ఇప్పుడు ఇలా విజన్ 2047 అని.. వరుసగా బాబు వేస్తున్న అడుగులు.. భవిష్యత్ ఆలోచనలతో.. వైసీపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు.. ఈ దెబ్బతో రేపోద్దున టీడీపీ అధికారలోకి వైసీపీ ఇంటికి వెళ్ళి నా ఆశ్చర్యపదనక్కర్లేదేమో. ముఖ్యంగా విజన్ 2047లో డెమోక్రసి, డెమోగ్రఫీ, డైవర్సిటీ అనే మూడూ ఈ దేశ పునాదులని వెల్లడించారు. మహిళాసాధికారత, స్వఛ్చభారతం, శ్రేష్ఠభారతం, నేషనల్ ఏడ్యుకేషన్ పాలసీ ఆవశ్యకత.. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతంగా అమలుపరచాలని తెలిపారు. ఇవన్నీ చేస్తూ ఉంటే దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
ఇక చంద్రబాబు మాటలతో ఏపీ జనాలు ఆలోచనలో పడ్డారు. ఒకసారి ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. రాజధాని లేని తమ రాష్ట్ర దుస్థితిని తలచుకుని కలత చెందుతున్న ఏపీ ప్రజానీకానికి చంద్రబాబు పాంచ్ పటాకా.. పంచాక్షరి మంత్రంగా కనిపిస్తోంది. ఆయన వస్తే.. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక.. ఎలాంటి ఇన్‌ఫ్రా.. కనీసం రాజధాని లేని రాష్ట్రాన్ని బాబు మాత్రమే గట్టెంకించ గలరని మాట్లాడుకుంటున్నారు. జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఈ పరిస్థితికి వచ్చామని.. ప్రజవేదిక మొదలైన కూల్చివేతలు.. రుషికొండ సర్వనాశనం వరకూ వచ్చాయని కాబట్టి జగన్ వద్దు.. బాబు ముద్దు.. అని జనాలు అనుకుంటున్నారు. మరోవైపు ఇదొక పెద్ద విజనా అని పైకి విమర్శిస్తున్నా లోలోపల అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.