బిగ్ బాస్ సీజన్ 7 కోసం యాజమాన్యం పక్కాగా అన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే పలు ప్రోమోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున ఈసారి బిగ్ బాస్ కొత్తగా కాదు.. సరికొత్తగా ఎవ్వరి ఊహలకి అందని విధంగా ఉండబోతుంది అంటూ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున కొత్త కొత్త ప్రోమోస్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ సీజన్ పై ఇంట్రెస్ కలిగిస్తున్నారు.
అసలైతే ఆగస్టు లోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలు పెడతారని అనుకున్నారు. అంతగా జనాల్లో ఊహాగానాలు క్రియేట్ చేసారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 3 న బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం కంటెస్టెంట్స్ అందరిని ముందుగానే బుక్ చేసిన హోటల్ రూమ్స్ లో ఉంచబోతున్నట్లుగా టాక్ ఉంది. దీని కోసం అగ్రిమెంట్స్ పూర్తి చేసిన వారు అప్పుడే స్పెషల్ ప్రోమోస్ కోసం రెడీ అయ్యారట.
హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్రోమోస్ కోసం స్టార్ మా యాజమాన్యం తలమునకలై ఉన్నారట. మరి అన్నీ పూర్తయినా ఆ డేట్ ఏదో లాక్ చేసి ప్రకటిస్తే బుల్లితెర ప్రేక్షకులు హ్యాపీ గా ఫీలవుతారు.